జనసేనాని పవన్ స్పీచ్‌కి అన్న చిరంజీవి ఫిదా.. చిరు స్పందన ఇలా..!
- జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఉద్వేగభరిత ప్రసంగం
- పవన్ ప్రసంగంపై ఎక్స్ వేదికగా స్పందించిన చిరంజీవి
- పవన్ స్పీచ్ కి మంత్రముగ్దుడినయ్యానని వ్యాఖ్యలు
- ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందని వెల్లడి
జనసేనాని పవన్ ప్రసంగ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో పక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తమ్ముడు పవన్ ప్రసంగాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా పవన్ ప్రసంగంపై ఆయన స్పందించారు. జనసేన జయకేతన సభలో పవన్ స్పీచ్‌కి మంత్రముగ్దుడినయ్యానని అన్నారు.
సభకు వచ్చిన అశేష జన సంద్రంలానే తన మనసు ఉప్పొంగిందని చిరంజీవి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్పూర్తితో పవన్ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని చిరంజీవి ఆశీర్వదిస్తూ .. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.