ప్రకృతి వైద్యం కోసం కేరళ వెళ్లిన అల్లు అరవింద్

ప్రకృతి వైద్యం కోసం కేరళ వెళ్లిన అల్లు అరవింద్

Allu Aravind goes to Kerala for nature cure
 
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకృతి వైద్యం కోసం కేరళ వెళ్లారు. ఈ విషయాన్ని అల్లు ఫ్యామిలీ సన్నిహితుడు నిర్మాత బన్నీ వాసు వెల్లడించారు. కేరళలోని ఓ ప్రఖ్యాత వెల్ నెస్ సెంటర్ ను అల్లు అరవింద్ సందర్శిస్తారని బన్నీ వాసు తెలిపారు. ఈ వెల్ నెస్ సెంటర్ లో బరువు తగ్గేందుకు ప్రకృతి చికిత్సలు ఉంటాయని వివరించారు. అల్లు అరవింద్ ఈ సెంటర్ లో కొన్నాళ్ల పాటు చికిత్స పొందుతారని పేర్కొన్నారు. 

కాగా, అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఛావాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హిస్టారికల్ మూవీ తెలుగులో మార్చి 7న థియేటర్లలోకి రానుంది. 

ఇందులో విక్కీ కౌశల్ శంభాజీ మహరాజ్ గా అద్భుత నటనను ప్రదర్శించాడు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది.
Advertisement
Allu Aravind
Nature Cure
Kerala
Tollywood

More Telugu News