రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్ రెడ్డి
- వేసవి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్
- ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని సూచన
- పంటలు ఎండిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం
ఎండలు పెరిగే కొద్దీ తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని... రైతులు ఇబ్బంది పడకుండా, పంటలు ఎండిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని... నిర్ణీత కోటా కంటే ఎక్కువ నీటిని ఏపీ తరలించకుండా అడ్డుకట్ట వేయాలని అన్నారు. దీనికి టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.