మూడేళ్ల తర్వాత అద్దంలా మారిన గుంటూరు రోడ్డు
- అప్పుడు గుంతలమయం.. ఇప్పుడు అద్దంలా మెరిసిపోతున్న వైనం
- ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి పనులు పూర్తి
- రూ. 3 కోట్లతో రోడ్డు నిర్మించిన కూటమి సర్కారు
మరమ్మతులు, విస్తరణ పనులను అప్పట్లో ఓ కాంట్రక్టరుకు అప్పగించింది. అయితే, నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ఆపేశారు. మరమ్మతు పనుల కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేశారు. దీంతో వాహనదారుల కష్టాలు రెట్టింపయ్యాయి. సుమారు 1.6 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు మీద గుంతల కారణంగా చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జనం ఆందోళనలు చేశారు. అయినప్పటికీ జగన్ సర్కారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక అగ్రహారం రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. రూ.3 కోట్లతో రోడ్డును అద్దంలా మార్చేసింది. మధ్యలో డివైడర్‌నూ నిర్మించి నగరవాసుల కష్టాలకు ముగింపు పలికింది.