Indian Railways: ప్రయాణికులకు గమనిక.. 10-21వ తేదీల మధ్య 30 రైళ్ల రద్దు

South central railway cancels 30 trains between 10 to 21
షార్ట్స్‌లో చూడండి
ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల నేపథ్యంలో 30 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, భద్రాచలం రోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా, 9 రైళ్లను దారి మళ్లించారు. అలాగే, గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు 11 రోజులపాటు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.

సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (17201/170202)ను 11వ తేదీ నుంచి 21 వరకు, సికింద్రాబాద్-సిర్పూరు కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233/17234) రైలును 10 నుంచి 21 వరకు రద్దు చేశారు.

అలాగే, గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12705/12706)‌ను 10, 11, 15, 18, 19, 20 తేదీల్లో.. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్ (1713/12714)ను 11, 14, 16, 18, 19, 20, తేదీల్లో రద్దు చేశారు. 

సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20834) 19, 20 తేదీల్లో 75 నిమిషాలు, ఆదిలాబాద్-తిరుపతి మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ (17406) 9, 11, 14, 19 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Indian Railways
Secunderabad
Vijayawada
Khammam

More Telugu News