ఆర్జే శేఖర్ బాషాపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు

Lavanya complaint against Sekhar Basha in PS
  • డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్ బాషా ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
  • తన ఇంట్లో 140 గ్రాముల డ్రగ్స్ పెట్టి ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదు
  • ఆడియో ఆధారాలను సమర్పించిన లావణ్య
డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి లావణ్య, ప్రముఖ ఆర్జే, బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్ బాషా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో ఆధారాలను ఆమె పోలీసులకు సమర్పించారు. తన ఇంట్లో 140 గ్రాముల డ్రగ్స్ పెట్టి ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మస్తాన్‌సాయి మహిళలకు డ్రగ్స్ ఇచ్చి, లైంగిక వాంఛలు తీర్చుకుంటూ వీడియోలు చిత్రీకరిస్తుంటాడని ఇదివరకే లావణ్య ఫిర్యాదు చేయగా, నార్సింగి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతడి బాధితుల్లో వివాహత మహిళలు కూడా ఉన్నారని వెల్లడించింది.

సినీ నటుడు రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని లావణ్య ఇదివరకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలోనే మస్తాన్‌సాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా, లావణ్య డ్రగ్స్ కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు.
Go Back to Shorts
Lavanya
Tollywood
Telangana
Police

More Telugu News