పార్లమెంట్‌లో మళ్లీ అదే రచ్చ.. లోక్‌సభ నిరవధిక వాయిదా
మరోవైపు, లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. విపక్ష ఎంపీల నినాదాలపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. పార్లమెంటు గౌరవాన్ని, సభలో శాంతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడిపైనా ఉందని పునరుద్ఘాటించారు. జాతీయగీతాలాపన పూర్తయిన వెంటనే సభను వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. శీతాకాల సమావేశాలకు ముగింపు సూచకంగా వాయిదా వేశారు. దీంతో దిగువ సభ నిరవధిక వాయిదా పడింది. కాగా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపించేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.