ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
- ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు
- టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సాన సతీశ్... బీజేపీ నుంచి కృష్ణయ్యకు చాన్స్
- డిసెంబరు 20న పోలింగ్
మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. డిసెంబరు 20న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున ఓట్ల లెక్కింపు చేపడతారు.