కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎంపీ

Former MLA Atram Sakku joins Congress
  • టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ సమక్షంలో చేరిక
  • కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ నేత ఆత్రం సక్కు
  • అదే బాటలో బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో వారు అధికార పార్టీలో చేరారు. 

ఆత్రం సక్కు 2009, 2019లో ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ రెండు పర్యాయాలు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ చేతిలో ఓడిపోయారు.

ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు 2019లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2024లో బీజేపీ గోడం నగేశ్‌కు టిక్కెట్ ఇచ్చింది. ఆయన అప్పటి నుంచే అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో వారు కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
Advertisement
BJP
BRS
Congress
Adilabad District

More Telugu News