సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్
- ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్
- రూ.1 లక్ష పూచీకత్తుతో పాటు పలు షరతులు విధించిన ఏసీబీ కోర్టు
- యూకే, అమెరికా, జర్మనీ, చైనా పర్యటనకు గ్రీన్ సిగ్నల్
- సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని ఆదేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, అధికారిక పర్యటన నిమిత్తం తన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని, విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, పలు షరతులతో ఆయన విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆగస్టు 3న జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించవచ్చు. అయితే, ఈ పర్యటనకు న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఒకరి హామీని సమర్పించాలని ఆదేశించింది. పర్యటన ప్రణాళిక, ఆయా దేశాల్లో బస చేసే వివరాలను కోర్టుకు అందించాలని స్పష్టం చేసింది. వీటితో పాటు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి రాజకీయపరమైన అనుమతి పొందాలని, పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక 2026 సెప్టెంబర్ 18 లోగా తన పాస్‌పోర్ట్‌ను తిరిగి కోర్టులో జమ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
2015లో నమోదైన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మొదటి నిందితుడిగా (ఏ1) ఉన్నారు. అప్పట్లో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై 2015 మే 31న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉన్న రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతుల్లో భాగంగా ఆయన తన పాస్‌పోర్ట్‌ను కోర్టుకు అప్పగించారు. విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఏసీబీ కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అప్పట్లో హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, ఇతరులపై ఏసీబీ అధికారులు అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర (ఐపీసీ 120బీ) కింద ఛార్జిషీట్ దాఖలు చేశారు. తనపై ఉన్న ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది.