ఈ నెల 22న పీవీ సింధు వివాహం .. వరుడు ఎవరంటే..!
- హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయిని వివాహం చేసుకోబోతున్న పీవీ సింధు
- రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం .. హైదరాబాద్‌లో 24న రిసెప్షన్
- వివరాలు వెల్లడించిన సింధు తండ్రి రమణ
ఈ తరుణంలో సింధు వివాహ ముహూర్తం ఖరారు కావడంతో ఆమె తండ్రి పీవీ రమణ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో సింధు పెళ్లి ఖాయమైందని, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ నెల 22న పెళ్లి జరగనుందని ఆయన తెలిపారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెళ్లికి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ఈ నెల 20న ప్రారంభం కానున్నాయని తెలిపారు.
సాయి కుటుంబం తమకు చాలా కాలంగా తెలుసునని, గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. జనవరి నుంచి సింధు షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ నెలలోనే పెళ్లి మూహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ఇక సింధు వివాహం చేసుకోబోతున్న వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.