పుప్ప - 2 ప్రీ రిలీజ్ వేడుక .. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- హైదరాబాద్‌లో నేడు పుష్ప – 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
- ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎనిమిదివేల పాసులు జారీ చేసిన నిర్వాహకులు
- యూసఫ్‌గూడ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- 300 మందితో పోలీస్ బందోబస్తు
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. వేడుక ప్రాంతాన్ని నిన్న అదనపు కమిషనర్ (శాంతి భద్రతలు) విక్రమ్‌సింగ్ మాన్.. పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్, పశ్చిమ మండల ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్, జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, శ్రేయాస్ మీడియా నిర్వాహకుడు శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు.
.