రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్.. తొలిసారి వైర్‌లెస్ హెడ్‌ఫోన్ విడుదల.. రేట్ల వివరాలు ఇవే
- ‘రియల్‌మీ పీ1 స్పీడ్ 5జీ’ స్మార్ట్‌ఫోన్ విడుదల
- ధర రూ.17,999-రూ.20,999గా ప్రకటన
- భారత్‌లో తొలిసారి వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను కూడా ఆవిష్కరించిన రియల్‌మీ
ఫోన్ ఫీచర్లు ఇవే
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్, వేడి నియంత్రణ కోసం 6,050ఎంఎం స్క్వేర్ స్టెయిన్‌లెస్ స్టీల్ వీసీ కూలింగ్ ఏరియా, 45వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాలతో ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. 1,080x2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.67 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. 2,000 నిట్‌ల బ్రైట్‌నెస్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే, 50-మెగాపిక్సెల్ ఏఐ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ ఫోన్ బరువు 185 గ్రాములు ఉంటుంది.
వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ విడుదల
మరోవైపు భారతదేశంలో రియల్‌మీ కంపెనీ తన మొట్టమొదటి వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ ఆవిష్కరించింది. రియల్‌మీ టెక్‌లైఫ్ స్టూడియో హెచ్1 పేరిట విడుదల చేసింది. ఈ హెడ్‌ఫోన్స్ ధర రూ.4,999గా ఉంది. నలుపు, ఎరుపు, తెలుపు రంగులలో లభిస్తున్న ఈ హెడ్‌సెట్‌పై ప్రారంభ ఆఫర్ కింద రూ.500 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.