సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటున్న మెగాస్టార్ సినిమా!
- చిరంజీవి విశ్వంభర సినిమా వాయిదా
- పెండింగ్‌లో విఎఫ్‌ఎక్స్ వర్క్స్
- త్వరలో అధికారిక ప్రకటన
సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ పెండింగ్‌లో వుండటంతో పాటు విశ్వంభర ఓటీటీ డీల్ కూడా ఇంకా పూర్తికాకపోవడంతో మేకర్స్ ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించాలనే ఆలోచనలో వున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కునాల్‌కపూర్, రమ్య పసుపులేటి ఈష చావ్లా ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విశ్వంభరకు స్వరాలు అందిస్తున్నారు.