జగన్ డిక్లరేషన్ సంగతి టీటీడీ చూసుకుంటుంది: పవన్ కల్యాణ్
- ఈరోజు తిరుమలకు వెళుతున్న జగన్
- డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకోవాలంటున్న హిందూ సంఘాలు
- అన్యమతాల గురించి మాట్లాడొద్దని జనసైనికులకు పవన్ సూచన
మరోవైపు, తిరుపతిలో జగన్ కు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన నిర్ణయించినట్టు తెలుస్తోంది. డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకునే ప్రక్రియ అని... ఇతర మతాల గురించి ఎలాంటి కామెంట్లు చేయొద్దని పవన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలకు జనసేన శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. బీజేపీ శ్రేణులు అప్పుడే రంగంలోకి దిగాయి. ఇంకోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో పోలీసు భద్రతను పెంచారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, నిరసన కార్యక్రమాను చేపట్టకూడదని పోలీసులు తెలిపారు.