జానీ మాస్టర్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు
- జానీ మాస్టర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దన్న కోర్టు
- అవసరమైతే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని సూచన
- ఈ నెల 28 వరకు జానీ మాస్టర్‌ను విచారించనున్న పోలీసులు
తనను మోసం చేశాడని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసి పీటీ వారెంట్‌పై హైదరాబాద్ కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 28 వరకు నార్సింగి పోలీసులు ఆయనను ప్రశ్నించనున్నారు.