భార్య ఆర్తితో జయం రవి విడాకులకు కారణం ఆ సింగరేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్య ఆర్తితో జయం రవి విడాకులకు కారణం ఆ సింగరేనా?

Is Jayam Ravi secret relationship with a singer
  • ఆర్తితో 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నట్టు ఇటీవల జయం రవి ప్రకటన
  • తనకు తెలియకుండానే జయం రవి విడాకులకు దరఖాస్తు చేశాడన్న ఆర్తి
  • బెంగళూరు సింగర్‌తో రవి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ‘నక్కీరన్’లో వార్తలు
  • వారిద్దరూ ఒకసారి గోవాలో ట్రాఫిక్ పోలీసులకు దొరికి జరిమానా చెల్లించారంటూ వార్త
భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు తమిళ నటుడు జయం రవి ఇటీవల ప్రకటించాడు. 15 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచేసుకున్నట్టు జయం రవి చేసిన ప్రకటన ఆయన అభిమానులను షాక్‌కు గురిచేసింది. మరోవైపు, ఈ విడాకుల విషయం తనకు తెలియదని ఆర్తి చేసిన ప్రకటన మరింత గందరగోళాన్ని సృష్టించింది.

అయితే, జయం రవి విడాకుల ప్రకటన వెనక అసలు కారణాన్ని తమిళ ఇన్వెస్టిగేటివ్ మ్యాగజైన్ నక్కీరన్ వెల్లడించింది. బెంగళూరుకు చెందిన సింగర్‌తో జయం రవికి రిలేషన్ ఉందని, భార్యాభర్తల మధ్య విభేదాలకు అదే కారణమని పేర్కొంది. దీనికితోడు ఆ సింగర్‌తో కలిసి రవి వెకేషన్ కోసం గోవా వెళ్లడం వారి మధ్య విభేదాలను మరింత రాజేసిందని వివరించింది. 

ఆ సింగర్ గోవాలో ట్రాఫిక్‌ను ఉల్లంఘించినందుకు జూన్‌లో జరిమానా కూడా చెల్లించిందని పేర్కొంది. అదే సమయంలో అదే కారు ఓవర్ స్పీడ్‌కు జయం రవి కూడా జరిమానా చెల్లించాడని తెలిపింది. ఆ కారును గతంలో సింగర్ ఉపయోగించిందని వివరించింది. దీనినిబట్టి వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని అర్థమవుతోందని పేర్కొంది. రవితో సమస్యను పరిష్కరించుకోవాలని ఆర్తి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని నక్కీరన్ రాసుకొచ్చింది.
Advertisement
Jayam Ravi
Aarti
Tamil Acter
Bengaluru Singer

More Telugu News