కొత్త ఫోన్ ఆవిష్కరించిన రియల్‌మీ... ఫీచర్లు అదుర్స్
- రియల్‌మీ పీ2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన కంపెనీ
- కనిష్ఠ ధర రూ.21,999, గరిష్ఠ ధర రూ.27,999గా ప్రకటన
- ఆకర్షణీయమైన ఫీచర్లు అందించిన కంపెనీ
ధర ఎంతంటే?
రియల్‌మీ పీ2 ప్రో ఫోన్ బూడిద, ఆకుపచ్చ రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియెంట్ ఫోన్ ధర రూ.21,999గా ఉంది. ఇక 12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియెంట్ ధర రూ. 24,999గా... 12జీబీ ర్యామ్ + 512జీబీ మోడల్ ఫోన్ రేటు రూ.27,999గా ఉన్నాయి.
బేసిక్ మోడల్‌పై రూ.2,000, ఇతర మోడళ్లపై రూ.3,000 వరకు ఫ్లాట్ తగ్గింపు ఆఫర్లను కంపెనీ అందిస్తోంది. అయితే ఈ తగ్గింపు ఆఫర్ దీపావళి పండగ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌పై అమ్మకాలు మొదలవుతాయి.
ఫోన్ ఫీచర్లు ఇవే..
రియల్‌మీ పీ2 ప్రో ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్2 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14, 2000 నిట్‌ల బ్రైట్‌నెస్, 6.7 అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్ 120హెట్జ్, ప్రత్యేకమైన గొరిల్లా గ్లాస్‌తో ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇక, కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ సెకండరీ డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32ఎంపీ కెమెరాను కంపెనీ అందించింది. బ్యాటరీ సామర్థ్యం 5,200 ఎంఏహెచ్ కాగా, 80వాట్స్ యూఎస్‌బీ టైప్-సీ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.