ఉద్యోగం కోసం చూస్తున్నారా?.. ఈ అంశాలు ఉంటే పక్కన పెట్టేస్తారట!
- ఈ అంశాలు ఉంటే తిరస్కరించాలంటూ రిక్రూటర్ లిస్ట్
- పొరపాటున సోషల్ మీడియాలో లీకైన అంశాలు
- ‘ఓపెన్ టు వర్క్’ అభ్యర్థులను వద్దన్న రిక్రూటర్
- 2-4 నెలల ఉద్యోగ విరామాలపైనా పరిమితులు
- తరచూ ఉద్యోగాలు మార్చేవారినీ తిరస్కరించాలని సూచన
ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే లింక్డిన్‌లో ‘ఓపెన్ టు వర్క్’ బ్యాడ్జ్ పెట్టుకున్నారా? తరచూ ఉద్యోగాలు మారుతున్నారా? కొంతకాలం ఉద్యోగ విరామం ఉందా? ఇవన్నీ మీకు ఉద్యోగం రాకుండా చేసే కారణాలుగా ఓ రిక్రూటర్ భావించినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన జాబితా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘ఎక్స్’లో ‘CorpAbsurdity’ అనే ఖాతా ఉన్న వ్యక్తి ఈ జాబితాను షేర్ చేసింది. ఓ ఉద్యోగ ప్రకటనలో రిక్రూటర్ పొరపాటున ఈ నోట్స్‌ను ఉంచినట్లు పేర్కొంది. అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో ఈ లక్షణాలు ఉంటే తిరస్కరించాలి అంటూ కొన్ని అంశాలను అందులో పేర్కొన్నట్లు తెలిపింది.
లింక్డిన్‌లో ‘#OpenToWork’ పెట్టుకున్నవారు, పనితీరు కారణంగా గత ఉద్యోగం కోల్పోయినవారు, ప్రస్తుతం మరో ఉద్యోగం మధ్యలో ఉన్నవారిని పరిగణనలోకి తీసుకోవద్దని ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, క్రిప్టోకరెన్సీ వంటి ట్రెండింగ్ టెక్నాలజీలపై ఆసక్తి చూపేవారిపైనా అభ్యంతరం ఉన్నట్లు కనిపించింది.
కాంట్రాక్ట్ లేదా పార్ట్‌టైమ్ ఉద్యోగ అనుభవం ఉన్నవారిని, రెజ్యూమేలో రెండు నుంచి నాలుగు నెలల విరామం ఉన్నవారిని కూడా ఈ జాబితాలో చేర్చారు. ఒకే సంస్థలో ఎక్కువకాలం పనిచేయకుండా ప్రతి 1.5 నుంచి రెండేళ్లకోసారి ఉద్యోగం మార్చేవారినీ ‘జాబ్ హాపర్స్’గా పేర్కొన్నారు. కేవలం బిగ్‌టెక్ సంస్థల్లో పనిచేసినవారు, ఎనిమిదేళ్లకు మించిన అనుభవం ఉన్నవారిపైనా పరిమితులు ఉన్నట్లు వెల్లడైంది.
ఈ జాబితాపై ‘ఎక్స్’ యూజర్లు తీవ్రంగా స్పందించారు. ఉద్యోగ విరామాలు, ఉద్యోగ మార్పులు ప్రస్తుతం సాధారణమేనని పలువురు పేర్కొన్నారు. రెండు నుంచి నాలుగు నెలల గ్యాప్‌ను అర్హతకు వ్యతిరేకంగా చూడటం వల్ల పిల్లల సంరక్షణ కోసం ఉద్యోగానికి దూరమైన మహిళలు కూడా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఓ యూజర్ వ్యాఖ్యానించారు.
టెక్ రంగంలో తరచూ ఉద్యోగ కోతలు జరుగుతున్న నేపథ్యంలో 1.5–2 ఏళ్లకోసారి ఉద్యోగం మారినవారిని ‘జాబ్ హాపర్స్’గా చూడటం సరికాదని మరొకరు అన్నారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఇంటర్వ్యూ దశకు చేరుకున్నా.. ప్రస్తుతం ఉద్యోగంలో లేని వారిని తీసుకోవద్దన్న హెచ్‌ఆర్ నిబంధనను ఎదుర్కొన్న అనుభవాన్ని మరో యూజర్ పంచుకున్నారు.