కంగనా రనౌత్ పై నిప్పులు చెరిగిన రాబర్ట్ వాద్రా
- పార్లమెంటులో ఉండే అర్హత కంగనకు లేదన్న వాద్రా
- ఆమె ఎప్పుడూ ఆమె గురించే ఆలోచిస్తుందని విమర్శ
- మహిళల గురించి కూడా ఆమె ఆలోచించాలని సూచన
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ మాట్లాడుతూ... రైతుల ఉద్యమం వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు. బంగ్లాదేశ్ వంటి పరిస్థితులను తీసుకొచ్చే ప్రయత్నం జరిగి ఉండొచ్చని... కానీ మన దేశ బలమైన నాయకత్వం కారణంగా అది జరగలేదని చెప్పారు. రైతుల ఉద్యమం పేరుతో హింస చెలరేగిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై రాబర్ట్ వాద్రా కూడా విమర్శలు గుప్పించారు.