కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో చంద్రకళ పతకం గెలవడం అభినందనీయం: కొల్లు రవీంద్ర
- కామన్వెల్గ్ పోటీల్లో సత్తా చాటిన ఎక్సైజ్ కానిస్టేబుల్ చంద్రకళ
- చంద్రకళను అభినందించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
- పథకాలు సాధించే క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యాఖ్య
అంతర్జాతీయ క్రీడా వేదికలపై ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు తమ సత్తా చాటారు. కెనడాలో జరిగిన కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన రాష్ట్ర ఎక్సైజ్ కానిస్టేబుల్ చంద్రకళను గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం సత్కరించారు. మరోవైపు, ఏషియన్ గేమ్స్‌లో ఏపీకి చెందిన స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, క్రీడాకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ప్ఉందని స్పష్టం చేశారు. ఒలింపిక్స్‌లో ఏపీ అథ్లెట్లు పతకాలు సాధించేలా వారికి అన్ని విధాలా మద్దతు అందిస్తున్నామని తెలిపారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ అండగా నిలుస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్వెల్త్ 75 కేజీల విభాగంలో చంద్రకళ రజతం గెలవడం అభినందనీయమని రఆయన కొనియాడారు.
ఇదే సమయంలో, జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో చైనాపై 238-234 స్కోరు తేడాతో విజయం సాధించింది. ఈ జట్టులో ఏపీకి చెందిన వెన్నం జ్యోతి సురేఖ కీలక పాత్ర పోషించారు. ఆమెతో పాటు చికిత తనపర్తి, ప్రతిక ప్రదీప్ సభ్యులుగా ఉన్నారు. జ్యోతి సురేఖకు ఇది ఏషియన్ గేమ్స్‌లో నాలుగో స్వర్ణం కావడం విశేషం. ఈ విజయాలు రాష్ట్రానికి, దేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.