మొత్తం చిత్ర పరిశ్రమను నిందించకూడదు: అమలా పాల్
- సినిమాల్లో హీరోయిన్ల చిత్రీకరణపై స్పందించిన నటి అమలా పాల్
- పరిశ్రమను కాకుండా దర్శకుడి ఆలోచనా విధానాన్ని ప్రశ్నించాలని వ్యాఖ్య
- మహిళా ప్రాధాన్య చిత్రాలు పెరగడం సానుకూల మార్పు అని వెల్లడి
సినిమాల్లో కొందరు హీరోయిన్లను అభ్యంతరకరంగా చూపించడానికి మొత్తం చిత్ర పరిశ్రమను నిందించడం సరికాదని, అది ఆయా చిత్రాల దర్శకుడు లేదా టీమ్ ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుందని ప్రముఖ నటి అమలా పాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని, మహిళా ప్రాధాన్య చిత్రాలు ఎక్కువగా వస్తుండటం శుభపరిణామమని ఆమె పేర్కొన్నారు.
కొచ్చిలో జరిగిన 'ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్ 2026'లో అమలా పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణపై వస్తున్న విమర్శలపై స్పందించారు. "ప్రతి పరిశ్రమ నుంచి మంచి మహిళా ప్రాధాన్య చిత్రాలు వస్తున్నాయి. కాబట్టి మొత్తం పరిశ్రమను నిందించదలుచుకోలేదు. సమస్య ఏదైనా ఉంటే అది ఒక సినిమాకు లేదా దర్శకుడి ఆలోచనా విధానానికే పరిమితమై ఉంటుంది," అని ఆమె వివరించారు.
15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తాను ఎప్పుడూ మూస పాత్రలకు భిన్నంగా, ప్రత్యేకమైన పాత్రలనే ఎంచుకున్నానని అమలా పాల్ తెలిపారు. ఇందులో భాగంగానే 2019లో 'ఆడై' (తెలుగులో 'ఆమె') లాంటి సాహసోపేతమైన చిత్రంలో నటించానని గుర్తుచేసుకున్నారు. "ఆ సమయంలో నా ఇమేజ్ ఏమవుతుందోనని, అలాంటి పాత్రలే మళ్లీ వస్తాయేమోనని భయపడ్డాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అది చాలా ధైర్యమైన నిర్ణయంగా అనిపిస్తోంది. కానీ, ఇప్పుడు నన్ను 'ఆడై' లాంటి సినిమా చేయమంటే బహుశా చేయలేకపోవచ్చు," అని ఆమె స్పష్టం చేశారు. మహిళలు తమ స్థానం కోసం కష్టపడుతున్నారని, రానున్న రోజుల్లో మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.