టాటా సన్స్ లిస్టింగ్‌పై బోర్డులో విభేదాలు.. వ్యతిరేకిస్తున్న నోయెల్ టాటా
- లిస్టింగ్ నుంచి తప్పించుకునేందుకు పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనను పరిశీలించాలని బోర్డుకు విజ్ఞప్తి
- ట్రస్టుల సేవా లక్ష్యాల మధ్య వైరుధ్యం వస్తుందని ఆందోళన
- టాటా సన్స్ అభ్యర్థనను తిరస్కరించిన ఆర్బీఐ
- నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టీకరణ
- చైర్మన్ చంద్రశేఖరన్ పునర్‌నియామకం చట్టవిరుద్ధమన్న నోయెల్ టాటా
దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలనే ప్రతిపాదనను టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల దశాబ్దాలుగా గ్రూప్ అనుసరిస్తున్న సేవా దృక్పథానికి, వ్యాపార విలువలకు విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆర్‌బీఐ.. 2022 సెప్టెంబర్‌లో టాటా సన్స్‌ను 'అప్పర్-లేయర్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ' (ఎన్‌బీఎఫ్‌సీ)గా వర్గీకరించింది. ఈ నిబంధనల ప్రకారం మూడేళ్లలోగా అంటే 2025 సెప్టెంబర్ నాటికి టాటా సన్స్ తప్పనిసరిగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాల్సి ఉంది. అయితే, ఈ లిస్టింగ్ ప్రతిపాదనను నోయెల్ టాటా వ్యతిరేకిస్తున్నారు. లిస్టింగ్ జరిగితే బయటి పెట్టుబడిదారుల లాభాల అంచనాలకు, టాటా ట్రస్టుల సేవా లక్ష్యాలకు మధ్య వైరుధ్యం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
లిస్టింగ్ నుంచి తప్పించుకునేందుకు టాటా ట్రస్ట్స్ ఒక ప్రత్యామ్నాయ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను సూచించింది. దీని ప్రకారం, టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్‌ను టాటా సన్స్‌లో విలీనం చేయాలి. దీనివల్ల టాటా సన్స్‌కు సొంతంగా కార్యకలాపాలు, ఆదాయం లభించి, ఎన్‌బీఎఫ్‌సీ లేదా 'కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ' (సీఐసీ) వర్గీకరణ నుంచి బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ప్రతిపాదనను సమీక్షించాలని ఆయన బోర్డును కోరారు. గతంలో టాటా సన్స్ తన అప్పులను తీర్చివేసి, సీఐసీ హోదాను వదులుకోవడానికి చేసిన దరఖాస్తును ఆర్బీఐ ఈ మధ్యే తిరస్కరించడం గమనార్హం. ఇటీవల జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో లిస్టింగ్‌కు సిద్ధం కావాలనే తీర్మానంపై ఓటింగ్ జరగ్గా, నోయెల్ టాటా ఒక్కరే వ్యతిరేకంగా ఓటు వేశారు.
అంతేగాక ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు చైర్మన్‌గా తిరిగి నియమించాలన్న బోర్డు నిర్ణయాన్ని కూడా ఆయన చట్టవిరుద్ధం అని అభివర్ణించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కష్టకాలంలో గ్రూప్‌లోని ఇతర కంపెనీలకు అండగా నిలవడం టాటా సన్స్ చరిత్ర అని, బయటి వాటాదారులు ఇలాంటి నిర్ణయాలకు మద్దతు ఇస్తారన్న నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యా, వైద్యం, ఉపాధి రంగాల్లో టాటా ట్రస్టుల సేవా కార్యక్రమాలను కొనసాగించాల్సిన ఆవశ్యకతను ఆయన ఈ సందర్భంగా నొక్కిచెప్పారు.