గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన
- విద్యార్థినుల వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు
- న్యాయం చేయాలంటూ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి వద్ద విద్యార్థినుల నినాదాలు
ఈ నేపథ్యంలో, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి... న్యాయం జరగాలి... అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. వర్షం పడుతున్నప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు.
ఓ దశలో విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం జరగ్గా, కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.