JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డికి నచ్చకపోతే ఇలాగే ఉంటుంది... వీడియో వైరల్!

Interesting video of JC Prabhakar Reddy
షార్ట్స్‌లో చూడండి
రాయలసీమ రాజకీయనేతల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ విలక్షణమైన నేత. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ఆయన... గత ఐదేళ్లలో వైసీపీ నేతలతో తీవ్రస్థాయిలో పోరాటం జరిపారు. ప్రతి రోజు ఉదయం తన నివాసంలో సాధారణ ప్రజలను కలుసుకుని, వారి సమస్యలు తెలుసుకోవడం జేసీ ప్రభాకర్ రెడ్డి దినచర్యల్లో ఒకటి. 

తాజాగా, శ్రీనివాసులు అనే మాజీ టీడీపీ నేత కూడా జేసీని కలవడానికి ఆయన ఇంటికి వచ్చాడు. శ్రీనివాసులు గతంలో టీడీపీని వీడి, పెద్దారెడ్డి పక్షంలో చేరి జేసీపైనే విమర్శలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అలాంటి వ్యక్తి  తనను కలవడానికి రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమాత్రం సహించలేకపోయారు. వెంటనే వెళ్లిపోవాల్సిందిగా శ్రీనివాసులుకు స్పష్టం చేశారు. 

శ్రీనివాసులు ఎంతకీ వెళ్లకపోవడంతో జేసీ అనుచరుల్లో ఇద్దరు శ్రీనివాసులును చేతులతో మోసుకుంటూ బయటికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
JC Prabhakar Reddy
Tadipatri
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News