వాంఖెడే స్టేడియంలో టీమిండియాకు సన్మానం... మెరైన్ డ్రైవ్ లో అటు అరేబియా సముద్రం, ఇటు జనసముద్రం
కాగా, తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. అటు అరేబియా సముద్రం, ఇటు జనసముద్రం అన్నట్టుగా ఆ ప్రాంతం అంతా క్రికెట్ అభిమానులతో నిండిపోయింది. మెరైన్ డ్రైవ్ నుంచి ఆటగాళ్లు ప్రత్యేక ఓపెన్ టాప్ బస్సులో వాంఖె ే స్టేడియం వరకు ఊరేగింపుగా వెళ్లనున్నారు. అటు, వాంఖెడే స్టేడియంలోనూ అభిమానులు పోటెత్తారు.
