ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణం
- లోక్ సభకు వచ్చిన సోనియా, ప్రియాంకగాంధీ
- ప్రమాణం చివరలో జైహింద్, జై సంవిధాన్ అని రాహుల్ గాంధీ నినాదాలు
- వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్
సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్... రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అయితే, ఆయన వయనాడ్‌ను వదులుకొని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన చేసిన రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించారు.
ఈరోజుతో ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తి కానుంది. బుధవారం స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ ఎంపీ ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేశ్ పోటీ పడుతున్నారు. నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఈ రోజు సాయంత్రం వరకు గడువు ఉంది.