Nirmala Sitharaman: రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఉంటుంది: నిర్మలా సీతారామన్

FM Sitharaman underlines Centre support to states via timely tax devolution
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఎప్పుడూ ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సకాలంలో జీఎస్టీ బకాయిల చెల్లింపు, పన్నుల పంపిణీ ద్వారా రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామన్నారు.

వివిధ సంస్కరణల కోసం కేంద్రం అందిస్తున్న 50 ఏళ్ల వడ్డీరహిత రుణాలను అన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలని సూచించారు. అయితే ఈ పథకం ద్వారా అందిన మొత్తాన్ని పౌర కేంద్రీకృత ప్రాజెక్టుల కోసం వినియోగించవలసి ఉంటుందన్నారు. ఈ షరతులకు లోబడి ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చునని సూచించారు. కరోనా అనంతరం రాష్ట్రాల మూలధన వ్యయాలను పెంచే లక్ష్యంతో కేంద్రం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట వడ్డీలేని రుణాలను తీసుకువచ్చింది. 2024-2025 బడ్జెట్ రూపకల్పనపై ఆర్థికమంత్రుల సలహాలు, సూచనలను నిర్మలమ్మ తీసుకున్నారు. బడ్జెట్‌కు సంబంధించి మంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
Go Back to Shorts
Nirmala Sitharaman
Finance Minister
India

More Telugu News