ప్రకాశ్ రాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: విష్ణువర్ధన్ రెడ్డి
- ప్రకాశ్ రాజ్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలన్న విష్ణువర్ధన్ రెడ్డి
- హిందూ ధర్మంపైనా, నేతలపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణ
- తెలంగాణ కేంద్రంగా జరుగుతున్న కుట్రపై సిట్ విచారణకు డిమాండ్
ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. "కొంతమంది హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు" అని విమర్శించారు.
తెలంగాణ కేంద్రంగా ఏపీకి వ్యతిరేకంగా ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రలకు సహకరిస్తున్న వారిని గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.