కేవలం 1 గంట వ్యాలిడిటీ.. ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్
- రూ.9లకే ఏకంగా 10జీబీ డేటా
- గంటలోనే ముగిసిపోనున్న వ్యాలిడిటీ
- పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకునే యూజర్లకు అద్భుతమైన ఆఫర్
కాగా పెద్ద ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకునే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడనుంది. తాత్కాలిక డేటా బూస్ట్ అవసరమైనవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా టెలికం కంపెనీల ప్లాన్లు పరిశీలిస్తే 10జీబీ అదనపు డేటా కావాలనుకుంటే దాదాపు రూ.100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో రూ.9 రీఛార్జ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
కాగా రూ.9తో 10 జీబీ లభిస్తుండగా.. రూ.18 రీఛార్జ్‌తో యూజర్లు 20జీబీ డేటాను పొందవచ్చు. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లో ఈ ప్లాన్ ప్రస్తుతం యూజర్లకు అందుబాటులో ఉంది.