ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి పశ్చాత్తాపం.. వీడ్కోలు సందేశం విడుదల!
- వైసీపీ హయాంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్
- టీడీపీ అధికారంలోకి వచ్చాక బదిలీ
- గురువారం కోన శశిధర్‌కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించాక వీడ్కోలు సందేశం
- కావాలని ఎవరినీ అవమానించలేదంటూ పశ్చాత్తాపం
‘గత ఏడాదిన్నర కాలంలో ఎన్నో నేర్చుకున్నాను. విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశాను. నేను తనిఖీలలో ఉపాధ్యాయులు, సిబ్బందిని అవమానించానంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వచ్చాయి. అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే మాట్లాడాను. ఎవర్నీ అవమానించేందుకు అలా చేయలేదు. ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి. మరో మనిషిని అవమానించే గుణం నాకు లేదు’’ అని తెలిపారు.