డిజిటల్ ఇండియా అంటే ఇదే! ఈ వీడియో చూస్తే మతులు పోవడం ఖాయం.. కావాలంటే చూడండి!
- ఓ డ్యాన్సర్ ఆలోచనకు నెటిజన్ల ఫిదా
- క్యూఆర్ కోడ్‌ను ఫోన్‌లో చూపిస్తూ నృత్యం
- కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
నగదు రహిత లావాదేవీల విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో ముందుంది. ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే డిజిటల్ ఇండియా ఎంతగా పురోగమిస్తుందో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఓ డ్యాన్సర్ స్టేజిపై డ్యాన్స్ చేస్తూ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని క్యూఆర్ కోడ్‌ను ప్రదర్శించింది. ఆమె నృత్యానికి మెచ్చి డబ్బులు ఇవ్వాలనుకునే వారు ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఇవ్వాలనుకున్న మొత్తాన్ని పంపిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోకు కామెంట్లు కూడా హోరెత్తుతున్నాయి. డిజిటల్ ఇండియా అంటే ఇదే అని కొందరు కామెంట్ చేస్తే.. మోదీ కోరుకున్న డిజిటల్ ఇండియా ఇదేనని మరికొందరు అంటున్నారు. ఆ డ్యాన్సర్‌కు వచ్చిన ఆలోచనకు మరికొందరు ఫిదా అయితే, ఇంకొందరు డిజిటల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇందులో మోదీ తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను మీరూ వీక్షించండి!