వార్డు మెంబర్‌గా కూడా పని చేయని నన్ను ఎమ్మెల్సీని చేశారు: తీన్మార్ మల్లన్న భావోద్వేగం
- ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తీన్మార్ మల్లన్న
- తన గెలుపుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన మల్లన్న
- ఇక బాధ్యత కలిగిన మల్లన్నను చూస్తారని వ్యాఖ్య
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన గెలుపుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో తనకు వచ్చిన మొదటి అవకాశం ఇదే అన్నారు. తన గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించారన్నారు. నిన్నమొన్నటి వరకు ఉన్న మల్లన్న వేరు... ఈరోజు నుంచి బాధ్యత కలిగిన మల్లన్నలా ఉంటానన్నారు.