సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ కు ఈసీ వార్నింగ్
- రాజకీయ ప్రేరేపిత పోస్టులు తొలగించాలన్న ఈసీ
- ఆమోదయోగ్యం కాదంటూనే పోస్టులు తొలగించిన ‘ఎక్స్’
- ఎన్నికలు పూర్తయ్యే వరకూ వాటిని హోల్డ్ లో పెడుతున్నట్లు వివరణ
భావప్రకటన స్వేచ్ఛకు ‘ఎక్స్’ ప్రాధాన్యం కల్పిస్తుందని పేర్కొంటూ.. పోస్టులను హోల్డ్ లో పెట్టిన ఖాతాదారులకు ఈ విషయంపై సమాచారం అందించినట్లు ఎక్స్ ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. అదేవిధంగా ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాలను ‘ఎక్స్’ లో పబ్లిష్ చేసింది. ఎన్నికల కోడ్ ను అతిక్రమించేలా ఉన్న రాజకీయ పోస్టులను తొలగించాలంటూ ఈసీ జారీ చేసిన హెచ్చరికలను యథాతథంగా పోస్ట్ చేసింది.