సీఎం జగన్‌పై దాడి ఘటన గురించి ఈసీ ఆరా!
- విజయవాడ సీపీకి ఎపీ సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా ఫోన్
- ఏం జరిగిందనేదానిపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
- దాడి నేపథ్యంలో జగన్ బస్సు యాత్రకు బ్రేక్
- యాత్ర తదుపరి షెడ్యూల్‌పై నేడు క్లారిటీ ఇవ్వనున్న వైసీపీ
మరోవైపు, రాయిదాడిలో గాయపడ్డ సీఎం జగన్‌ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. నుదుటిపై వాపు ఎక్కువగా ఉండటంతో రెస్ట్ అవసరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం తన యాత్రకు నేడు విరామం ఇచ్చారు. యాత్ర తదుపరి షెడ్యూల్‌పై వైసీపీ నేడు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.