Hyderabad: శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

షార్ట్స్‌లో చూడండి
రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు భారీ ఊరట. అతనికి ఏసీబీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కోడిన బెయిల్ మంజూరయింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు షరతు విధించింది. ఒక లక్ష రూపాయలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ జనవరి 25న అరెస్టయ్యాడు. అతని ఇంటితో పాటు వివిధ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఏసీబీ ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసింది. నిర్ణీత 60 రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరయింది.
Go Back to Shorts
Hyderabad
ACB
ACB Court

More Telugu News