సూపర్ మేన్, స్పైడర్ మేన్ ఎవరైనా బాలకృష్ణ తర్వాతే: రాధ

Senior actress Radha heaps praise on Balakrishna
  • ఇటీవల టీవీ షోలలో పాల్గొంటున్న సీనియర్ నటి రాధ
  • తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు పంచుకున్న డాన్సింగ్ క్వీన్
  • బాలకృష్ణ సినిమాలను ఎంతో ఇష్టపడతానని వెల్లడి
  • ఎంత పెద్ద సీన్ అయినా సునాయాసంగా చేస్తారని కితాబు 
అలనాటి అందాల భామ, డ్యాన్సింగ్ క్వీన్ రాధ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే, కొన్నాళ్లుగా తెలుగు టీవీ షోలలో తళుక్కుమంటున్నారు. బుల్లితెర ద్వారా అయినా అభిమానులకు మళ్లీ దగ్గరయ్యానన్న ఆనందం ఆమెలో కనిపిస్తోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. బాలకృష్ణ సినిమాలను తాను ఎంతో ఇష్టపడతానని వెల్లడించారు. ఎంత పెద్ద సీన్ అయినా ఇట్టే చేసేస్తారని కొనియాడారు. సూపర్ మేన్, స్పైడర్ మేన్ ఎవరైనా సరే బాలకృష్ణ తర్వాతేనని అన్నారు. కొందరు హీరోలు ఏంచేసినా మనం ఇష్టపడతాం అని, అలాంటి వారిలో బాలకృష్ణ ఒకరని తెలిపారు. 

బాలకృష్ణతో తాను అనేక సినిమాల్లో నటించానని, ఆయనతో నటించిన మొదటి చిత్రం రక్తాభిషేకం అని రాధ వెల్లడించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నాతో సమానంగా డ్యాన్స్ చేసేందుకు ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేసేవారు, పాటలోని స్టెప్పులన్నీ ముందే ప్రాక్టీస్ చేసేవారని వివరించారు.
Advertisement
Radha
Balakrishna
Actress
Tollywood

More Telugu News