సౌదీలోని భారతీయులకు హెచ్చరిక.. వీడియోలు షేర్ చేయొద్దన్న ఎంబసీ
- పౌర మౌలిక సదుపాయాలపై దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన
- దాడులకు సంబంధించిన వీడియోలు, వార్తలను ప్రచారం చేయవద్దని స్పష్టీకరణ
- విమానాశ్రయాలపై దాడులను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
- ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, 36 మంది గాయపడ్డారని సౌదీ అధికారుల వెల్లడి
సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారత పౌరులకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక హెచ్చరిక జారీ చేసింది. దేశంలోని పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు జారీ చేసే అధికారిక సూచనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
ఈ దాడులకు సంబంధించిన వీడియోలను లేదా వార్తలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయవద్దని, వాటిని రీపోస్ట్ చేయవద్దని ఎంబసీ సూచించింది. పరిస్థితుల దృష్ట్యా అవసరమైతే ఇళ్లకే పరిమితం కావాలని ప్రకటనలో పేర్కొంది.
ఇటీవల అభా అంతర్జాతీయ విమానాశ్రయం, రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయాలపై జరిగిన దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా ఖండించింది. పౌర లక్ష్యాలపై దాడులు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సౌదీ అరేబియా ప్రభుత్వానికి, ప్రజలకు భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది.
సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీఏసీఏ) గణాంకాల ప్రకారం, అక్టోబర్ 6, 7 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించగా, 36 మంది గాయపడ్డారు. మృతుల్లో మొరాకో, అల్జీరియా, సుడాన్ దేశస్థులు ఉన్నారు. గాయపడిన వారిలో సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, పాకిస్థాన్ దేశాలకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.