బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు హైకోర్టులో ఊరట
Add ap7am to your home Screen

బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు హైకోర్టులో ఊరట

Huge relief for Bandi Sanjay son Bhagirath in High Court
  • పోక్సో కేసుకు సంబంధించి మీడియా ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశం
  • తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని భగీరథ్ పిటిషన్ 
  • సంబంధిత కంటెంట్ తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు సూచన
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురికి నోటీసులు జారీ
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి మీడియా, సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

సదరు కేసులో తనకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరైనప్పటికీ, కొన్ని టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆ కేసుకు సంబంధించిన అంశాలను ప్రసారం చేస్తూ తమ కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ భగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోక్సో కేసుతో ముడిపెట్టి మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నారని, ఇది వ్యక్తిత్వ హననానికి దారితీస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఉన్న అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించి, డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని ఆయన కోరారు.

వాదనలు విన్న ధర్మాసనం, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి కంటెంట్‌ను ప్రసారం చేయవద్దని టీవీ ఛానెళ్లు, ప్రైవేట్ వ్యక్తులు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఆదేశించింది. గూగుల్, మెటా, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ సంస్థలు సంబంధిత కంటెంట్‌ను తక్షణమే తొలగించి, డిజిటల్ రికార్డులను భద్రపరచాలని సూచించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్స్ శాఖలు, తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, సోషల్ మీడియా సంస్థలతో పాటు పలువురు ప్రైవేట్ వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Advertisement
Bandi Sai Bhagirath
Bandi Sanjay Kumar
Telangana High Court
POCSO Case
Media Trial
Social Media Content Removal

More Telugu News