బిగ్‌బాస్ విన్నర్‌పై ప్రేమ, మోసం ఆరోపణలు.. ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్యాయత్నం
- ఆరోపణల అనంతరం మాత్రలు తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన యువతి
- తామిద్దరం మంచి స్నేహితులమేనని స్పష్టం చేసిన ముత్తుకుమరన్
- ఘటనపై స్పందించిన గేయరచయిత్రి తామరై.. వివరణ కోరుతూ పోస్ట్
బిగ్‌బాస్ తమిళ సీజన్ 8 విజేత ముత్తుకుమరన్ జెగతీశన్‌పై ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ముత్తుకుమరన్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ వహీదా బేగం అనే యువతి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
బుధవారం రాత్రి వహీదా బేగం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో సంచలన విషయాలు వెల్లడించింది. గతంలో విడాకులు తీసుకున్న తాను మానసికంగా ఒంటరిగా ఉన్న సమయంలో అక్టోబర్ 4న చెన్నైలోని కాతిపారా వద్ద ముత్తుకుమరన్‌ను కలిశానని తెలిపింది. తనకు అప్పటికే వివాహమై ఐదేళ్ల కుమారుడు ఉన్నాడని తెలిసినప్పటికీ, పెళ్లి చేసుకుంటానని, తాళి కడతానని ముత్తు మాట ఇచ్చాడని పేర్కొంది. అదే రోజు రాత్రి తనను ఇంటికి తీసుకెళ్లి శారీరకంగా దగ్గరయ్యాడని, ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తేగానే ముఖం చాటేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మోసాన్ని తట్టుకోలేకే అధిక మోతాదులో మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది.
ఈ వీడియో విడుదలైన వెంటనే ఆమె స్నేహితులు అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత "దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో బతికే ఉన్నాను" అని ఆమె ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడం గమనార్హం. అనంతరం ముత్తుకుమరన్‌తో తాను సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వీడియోను కూడా ఆమె షేర్ చేసింది.
ఈ ఆరోపణలపై ముత్తుకుమరన్ స్పందించాడు. తాను, వహీదా కేవలం మంచి స్నేహితులమని, ఆమె ఎందుకిలా ప్రవర్తిస్తోందో తనకు అర్థం కావడం లేదని చెప్పాడు.
ఈ వ్యవహారంపై ప్రముఖ గేయరచయిత్రి, కవయిత్రి తామరై ఫేస్‌బుక్‌లో స్పందించారు. "ముత్తుకుమరా... ఓ యువతి ఈ విధంగా నిన్ను బయటపెడుతుందని ఊహించి ఉండవు కదా? ఇప్పుడు నీ అసలు స్వరూపం అందరికీ తెలిసింది. దీనిపై వివరణ ఇవ్వు" అని ఆమె ఘాటుగా పోస్ట్ చేశారు. మాటలతో మోసం చేసే ఈ కళను సహించకూడదని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు వహీదాకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు ఆమె డబ్బు లేదా పాప్యులారిట కోసమే ఇలా చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇంతవరకు పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు. వహీదా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.