వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.. అరెస్టులు తప్పవని హెచ్చరిక
Add ap7am to your home Screen

వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.. అరెస్టులు తప్పవని హెచ్చరిక

Trump Government crackdown on visa fraud and warning of arrests
  • ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ సహా 8 టెక్ కంపెనీలపై ఆంక్షల ప్రకటన
  • అమెరికన్లకు బదులుగా విదేశీయులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపణ
  • వీసా మోసాలపై దర్యాప్తునకు ప్రత్యేక స్ట్రైక్ టీమ్ ఏర్పాటు
  • కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లపై క్రిమినల్ కేసులు పెడతామన్న అటార్నీ జనరల్
వీసా మోసాలకు పాల్పడుతున్న సంస్థలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిబంధనలను ఉల్లంఘించే కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, సంస్థలు క్రిమినల్ విచారణలతో పాటు అరెస్టులు, సివిల్ దావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని శ్వేతసౌధం తీవ్రంగా హెచ్చరించింది. అమెరికన్లకు బదులుగా విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యమిచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.

వైట్ హౌస్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినీ సహా ఎనిమిది ప్రధాన టెక్, అవుట్‌సోర్సింగ్ కంపెనీలపై 'శాశ్వత లేబర్ సర్టిఫికేషన్' దరఖాస్తులకు సంబంధించి ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికన్ల పట్ల వివక్ష చూపే కంపెనీలు ఫెడరల్ ప్రభుత్వం, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాయని, వాటిపై సమగ్ర దర్యాప్తు చేపడతామని అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె తెలిపారు. సాక్ష్యాధారాలను బట్టి సంబంధిత అధికారుల అరెస్టులు కూడా ఉండొచ్చని ఆయన స్పష్టం చేశారు.

వీసా మోసాలపై దర్యాప్తును సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక 'స్ట్రైక్ టీమ్‌'ను ఏర్పాటు చేస్తున్నట్లు లేబర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డిఎస్పోసిటో వెల్లడించారు. ఇప్పటికే చేపట్టిన చర్యల ఫలితంగా 171 అభియోగాలు, 203 శిక్షలు, 80 అరెస్టులు నమోదయ్యాయని, వీటి ద్వారా సుమారు బిలియన్ డాలర్లకు పైగా ప్రజాధనాన్ని రక్షించగలిగామని ఆయన వివరించారు.

కొన్ని కంపెనీలు విదేశీ ఉద్యోగుల అర్హతల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నాయని, తక్కువ జీతాలకే మానవవనరులను పొందడానికి హెచ్-1బీ వంటి వీసా ప్రోగ్రామ్‌లను దుర్వినియోగం చేస్తున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపించారు. ఈ వీసా మోసాలకు వ్యవస్థీకృత నేరాలు, మానవ అక్రమ రవాణా, జాతీయ భద్రతకు ముప్పు వంటి అంశాలతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Trump Government
Visa Fraud
H1B Visa
JD Vance
Indian IT Companies
US Immigration Crackdown

More Telugu News