డాక్టర్ రెడ్డీస్, నెస్లే, అమెజాన్‌కు ఆహార భద్రతా సంస్థ నోటీసులు.. కారణమిదే!
- ప్రొటీన్ ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే ఆరోగ్య ప్రయోజనాలపై చర్యలు
- వివరణ ఇవ్వాలని కంపెనీలను ఆదేశించిన ఆహార భద్రతా సంస్థ
- వినియోగదారుల భద్రతకే తమ ప్రాధాన్యమని వెల్లడి
ప్రముఖ ఫార్మా, హెల్త్ సైన్స్, ఈ-కామర్స్ సంస్థలకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నోటీసులు జారీ చేసింది. ప్రొటీన్ సప్లిమెంట్లు, కండరాల దృఢత్వానికి సంబంధించిన ఉత్పత్తుల విషయంలో తప్పుదోవ పట్టించే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టింది. డాక్టర్ రెడ్డీస్, నెస్లే హెల్త్ సైన్స్, తిరుపతి వెల్‌నెస్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నెట్‌మెడ్స్ వంటి దిగ్గజ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
సదరు ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై అధిక ప్రొటీన్, కండరాల పటుత్వం, రోగనిరోధక శక్తి పెంపు, మెటబాలిజం వంటి ప్రయోజనాలు ఉంటాయని తప్పుడు ప్రకటనలు చేస్తున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ఈ క్లెయిమ్స్ వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, వీటిపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆయా కంపెనీలను ఆదేశించింది.
ఇదే సమయంలో, డాక్టర్ రెడ్డీస్, నెస్లే హెల్త్ సైన్స్‌తో పాటు మరికొన్ని సంస్థలపై నిబంధనలకు విరుద్ధమైన ప్రకటనలు, నాణ్యత లేని, గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ మరో ప్రకటనలో వెల్లడించింది.
ఆహార ఉత్పత్తులపై చేసే ఆరోగ్య, పోషకాహార ప్రకటనలు కచ్చితత్వంతో ఉండాలని, వినియోగదారులలో తప్పుడు అభిప్రాయాలు కలిగించకూడదని స్పష్టం చేసింది. వినియోగదారుల రక్షణ, సురక్షితమైన ఆహారాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించింది.