కేశినేని నానికి విశ్వాసం లేదు.. సైకోలంతా ఒకే చోటకు చేరారు: కేశినేని చిన్ని
- కేశినేని నానిపై పోటీకి సిద్ధమన్న కేశినేని చిన్ని
- ఎంపీగా పోటీ చేస్తే నాని 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతాడని విమర్శ
- దేవినేని అవినాశ్ ముఖ్య అనుచరుడిగా నాని మారారని ఎద్దేవా
టీడీపీలో ఉన్నప్పుడు కేశినేని నానికి చాలా గౌరవం ఉండేదని... వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆయన స్థాయి దిగజారిందని చిన్ని చెప్పారు. దేవినేని అవినాశ్ కు ముఖ్య అనుచరుడిగా నాని మారారని ఎద్దేవా చేశారు. విజయవాడ నుంచి తాను బరిలోకి దిగే అంశాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలని తమ నాయకత్వం సూచిస్తుందో... అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. టికెట్ల కేటాయింపులపై తమ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ చర్చిస్తారని చెప్పారు. కేశినేని నానిపై పోటీకి తాను సిద్ధమని అన్నారు.