ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ... కాన్వాయ్ ను ముందుకు కదలనివ్వని అంగన్వాడీలు  

Anganwadi workers obstructs minister Peddireddy convoy in Uravakonda
ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. మంత్రి కాన్వాయ్ ని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పెద్దిరెడ్డి వాహనం ముందు బైఠాయించి వారు నిరసన తెలిపారు. 

ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన, సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి పెద్దిరెడ్డి ఉరవకొండ వచ్చారు. 

ఈ నేపథ్యంలో, ఆయన కాన్వాయ్ ను ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్న అంగన్వాడీలు అరగంట సేపు ఆందోళన చేపట్టారు. దాంతో, మంత్రి పెద్దిరెడ్డి తన వాహనంలోనే రోడ్డుపై ఉండిపోవాల్సి వచ్చింది. ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ దశలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను బలవంతంగా ఇవతలకు లాగేశారు. దాంతో, మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ముందుకు కదిలింది.
Go Back to Shorts
Peddireddi Ramachandra Reddy
Anganwadi Workers
Protest
Convoy
Uravakonda
YSRCP
Anantapur District

More Telugu News