జమిలి ఎన్నికలపై కమిటీకి లేఖ రాసిన అసదుద్దీన్ ఒవైసీ
- జమిలి ఎన్నికల ప్రతిపాదనలను వ్యతిరేకించిన మజ్లిస్
- జమిలి ఎన్నికలు భారత ప్రజాస్వామ్యానికి విపత్తు అని పేర్కొన్న అసదుద్దీన్
- కోవింద్ నేతృత్వంలోని కమిటీకి లేఖను పంపించిన అసదుద్దీన్
దేశంలో తరచుగా ఎన్నికలను నివారించటం, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సమయాన్ని తగ్గించటమే జమిలి ఉద్దేశం. మన దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీకి అసదుద్దీన్ తమ పార్టీ అభిప్రాయాన్ని పంపించారు.