వైసీపీకి రాజీనామా చేయనున్న ఎమ్మెల్యే దొరబాబు?
- పెండెం దొరబాబుకు పిఠాపురం టికెట్ నిరాకరణ
- ఈరోజు పుట్టినరోజు సందర్భంగా భారీ సమావేశం
- ఇప్పటికే వేరే పార్టీ నేతలను కలిసినట్టు సమాచారం
మరోవైపు, ఈ రోజు దొరబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన అనుచరులతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన తన అనుచరులకు ఆత్మీయ విందును ఇస్తున్నారు. ఈ సమావేశం ద్వారా తన బలాన్ని ప్రదర్శించాలని ఆయన భావిస్తున్నారు. ఇంకోవైపు, ఆయన ఇతర పార్టీ నేతలను కూడా కలిశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈనాటి సమావేశంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు? ఏ ప్రకటన చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.