మెట్రో రైలు కొత్త ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
- మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలపై డీపీఆర్, ట్రాఫిక్ స్టడీస్ పూర్తి చేయాలని ఆదేశం
- రాయదుర్గం - విమానాశ్రయం మెట్రో ప్రతిపాదనను పెండింగ్లో పెట్టాలని సూచన
- ఎల్బీ నగర్-హయత్ నగర్, మియాపూర్-పటాన్ చెరు, రాయదుర్గం-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్-ఎయిర్ పోర్ట్ మార్గాలకు ఓకే
వీటిలో ఎల్బీ నగర్ - హయత్ నగర్, మియాపూర్ - పటాన్ చెరు, రాయదుర్గం - ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్ - ఎయిర్ పోర్ట్ మార్గాలలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పాతబస్తీలో మెట్రో రైలు అంశంపై అక్కడి ప్రజాప్రతినిధులతో చర్చించాలని అధికారులకు సూచించారు. మతపరమైన, చారిత్రక కట్టడాలపై ప్రభావం పడకుండా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.