హైదరాబాద్‌వాసులకు అలర్ట్... మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత

హైదరాబాద్‌వాసులకు అలర్ట్... మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత

Alert to Hyderabad people Musarambagh bridge closed
  • బ్రిడ్జి మూసివేత నేపథ్యంలో అమల్లోకి ట్రాఫిక్ ఆంక్షలు
  • వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన ట్రాఫిక్ పోలీసులు
  • ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ఇతర మార్గాల ద్వారా కూడా వెళ్లాలని సూచన
హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్! మూసారాంబాగ్ వద్ద మూసీనదిపై ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. దీంతో ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయదారులను సూచించారు.

అంబర్ పేట నుంచి మూసారాంబాగ్ ఫ్లైఓవర్ మీదుగా మలక్ పేట టీవీ టవర్ వైపు వెళ్లే వాహనదారులు అలీ కేఫ్ క్రాస్ రోడ్డు వద్ద జిందాతిలిస్మాత్, గోల్నాక న్యూబ్రిడ్జి హైటెక్ ఫంక్షన్ హాల్, అప్జల్ నగర్ వైపు మళ్లిస్తున్నట్లుగా తెలిపారు. అక్కడి నుంచి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద కుడి మలుపు తిరిగి పిస్తా హౌస్, మూసారాంబాగ్ జంక్షన్ వైపు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లి సహకరించాలని సూచించారు.
Advertisement
Hyderabad
Telangana
moosarambagh bridge

More Telugu News