లోకేశ్ ది పాదయాత్ర కాదు.. క్యాట్ వాక్: చెల్లుబోయిన వేణు

లోకేశ్ ది పాదయాత్ర కాదు.. క్యాట్ వాక్: చెల్లుబోయిన వేణు

Nara Lokesh is doing cat walk says Chelluboyina Venu
  • లావు తగ్గడం కోసమే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారన్న వేణు
  • పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా
  • వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలుస్తుందని ధీమా
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు విమర్శలు గుప్పించారు. లావు తగ్గడం కోసమే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అది పాదయాత్ర కాదు.. క్యాట్ వాక్ అని వ్యాఖ్యానించారు. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని అన్నారు. పాదయాత్ర వల్ల ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గతంలోనే చెప్పారని... అయినా లోకేశ్ పట్టించుకోలేదని చెప్పారు. ఒక ఎర్ర బుక్కు రాస్తున్నానని లోకేశ్ పదేపదే చెపుతున్నారని... పాదయాత్రకే విలువ లేనప్పుడు ఎర్ర బుక్కు రాసుకుని ఏం చేస్తారని ప్రశ్నించారు. సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలకు పోజులివ్వడం తప్ప... పాదయాత్రకు పెద్ద విలువ లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైసీపీనే అని చెప్పారు.
Advertisement
Chelluboyina Venu
YSRCP
Nara Lokesh
Telugudesam

More Telugu News