అయోధ్య రాముడ్ని దర్శించాలనుకునే భక్తులకు గుడ్‌న్యూస్.. తొలి వంద రోజులు 1000కిపైగా రైళ్లు
- జనవరి 19 నుంచి అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు
- దేశంలోని వివిధ నగరాల నుంచి పరుగులు
- డిమాండ్‌ను బట్టి రైళ్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం
- 50 వేల మంది ప్రయాణికులను తట్టుకునేలా అయోధ్య స్టేషన్ పునరుద్ధరణ
ఇవన్నీ ఢిల్లీ, ముంబై, పుణె, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూ సహా వివిధ ప్రధాన నగరాల నుంచి నడుస్తాయి. డిమాండును బట్టి రైళ్ల సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు తెలిపారు. మరోవైపు, భక్తల తాకిడిని తట్టుకునేలా అయోధ్య రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించారు. రోజుకు 50 వేల మంది వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో ఆ మేరకు దాని సామర్థ్యాన్ని పెంచారు. జనవరి 15 నాటికి ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది.